గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి

గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి

ముద్ర,తెలంగాణ:- జగిత్యాలలో విషాదం చోటుచేసుకుంది. హార్ట్ ఎటాక్ అర్థం తెలియని.. చిన్న పిల్లవాడిని బలి తీసుకుంది ఈ మాయదారి రోగం. జగిత్యాల జిల్లాలోని థరూర్ గ్రామానికి చెందిన హర్షిత్ అనే 9 ఏళ్ల బాలుడు స్థానిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు హర్షిత్. దర్శనం అనంతరం స్వగ్రామానికి బయలు దేరారు ఆ కుటుంబం. ఇంటికి చేరుకుంటున్నాం అనగానే.. హర్షిత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బాబు గుండె పోటుతో చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆ గ్రామలోకూడా విషాద ఛాయలు అలముకున్నాయి.