పెద్దకల్వల వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడ్డ కారు

పెద్దకల్వల వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడ్డ కారు
  • చికురాయి గ్రామానికి చెందిన వినీత్ రెడ్డి(27) అనే కారు డ్రైవర్ మృతి


ముద్ర ప్రతినిధి,పెద్దపల్లి: పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి- పెద్దకల్వల మార్గంలో పెద్దకల్వలవైపు వెళ్తున్న కారు శుక్రవారం తెల్లవారు జామున రాత్రి 2 గంటలకు అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడింది.

దీంతో పెద్దపల్లి మండలం చికురాయి గ్రామానికి చెందిన వినీత్ రెడ్డి(27) అనే కారు డ్రైవర్ మృతి  చెందారు. ఆయన వెంట కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా పెద్దపల్లి హాస్పిటల్ కు తరలించారు.