డిగ్రీ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

డిగ్రీ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

మెట్‌పల్లి ముద్ర:- డిగ్రీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కు వినతి పత్రం అందజేశారు. జూనియర్ కళాశాల భవనం పూర్తి చేసి డిగ్రీ కళాశాల ను పట్టణ శివారు నుండి  పట్టణంలోని భవనానికి మార్చాలని వినతి పత్రం లో కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కాశిపాక అరవింద్, మణిదీప్, మనోజ్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.