ప్రజలకు మోదీ వ్యాక్సిన్ ఇప్పిస్తే.. కేసీఆర్ మందు పోయిస్తుండు... - కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జయదేవకర్

ప్రజలకు మోదీ వ్యాక్సిన్ ఇప్పిస్తే.. కేసీఆర్ మందు పోయిస్తుండు... - కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జయదేవకర్

కేసీఆర్ చెక్ బౌన్సర్... - బీజేపీ చీఫ్ బండి సంజయ్

ముద్ర, మల్యాల: ప్రధాని మోదీ ప్రజలకు ఫ్రీ గా వ్యాక్సిన్ ఇప్పిస్తే.. కేసీఆర్ డబ్బులకు మందు పోయిస్తుండని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు ప్రకాష్ జయదేవకర్ అన్నారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా... బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ చొప్పదండి నియోజకవర్గ స్థాయిలో (ఆరు మండలాలు) సంయుక్త మోర్చల సమ్మేళనం కార్యక్రమం సోమవారం మల్యాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో కలిసి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశమే తన పరివారoగా భావించి మోదీ పాలిస్తుంటే... కేసీఆర్ మాత్రం తన పరివారానికే లబ్ది చేకూరే విధంగా పరిపాలిస్తున్నాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 40 వేల కోట్లతో తానే అనుమతి ఇస్తే... లక్షా 20 వేల కోట్లు ఖర్చు పెట్టమని చెప్పడం అవినీతి కాదా అని ప్రశ్నించారు. 

అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ లో పనిచేయని చెక్కులు ఇచ్చి, చెక్ బౌన్సర్ సీఎం అయ్యారని హెద్దెవా చేశారు. రాష్టంలో రైతులు బతికే పరిస్థితి లేదని, రానున్న రోజుల్లో రైతులు బీఆర్ఎస్ నాయకులను ఉరికించే రోజులు వస్తాయన్నారు. కిసాన్ సర్కార్ అని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం అందజేయకపోవడం సిగ్గుచేటన్నారు. తన లబ్ది కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దశాబ్ది ఉత్సవాలకు ఖర్చు చేయడం ప్రజలు గమనించి, బుద్ది చెప్పాలన్నారు. కాగా, రాష్టంలో కాంగ్రెస్ పార్టీకి పోటీచేయడానికి అభ్యర్థులు లేరని బoడి సంజయ్ విమర్శించారు. అనంతరం వివిధ మోర్చలతో ప్రకాష్ జయదేవకర్ మాట్లాడుతూ వారి వ్యక్తిగత సమాచారం తెలుసుకున్నారు. మోదీ పాలన, పథకాలను ఒక్కో కార్యకర్త మూడు ఇళ్లను సందర్శించి, లబ్ది పొందిన వివరాలు, వీడియో రూపకంగా తెలంగాణ బీజేపీ వాట్సాప్ నంబర్ కు పంపించాలని సూచించారు. మహిళా మోర్చ నాయకులు ప్రకాష్ జయదేవకర్, బండి సంజయ్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, జిల్లా నాయకులు బింగి వేణు, బొట్ల ప్రసాద్, మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రవణ్ కుమార్, ఎంపీటీసీలు రాచర్ల రమేష్, కొల్లూరి గంగాధర్, సంగాని రవి, మండల నాయకులు నులుగొండ సురేష్, గాజుల మల్లేశం, జనగాం రాములు, కెల్లేటి రమేష్, బండారి రాజు, కరభూజ చక్రంగౌడ్, సొన్నాకుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచంలోనే ఫ్రీ బియ్యం పథకం లేదు...
సంయుక్త మోర్చల సమ్మేళనంలో భాగంగా మల్యాలకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, రాజసభ సభ్యులు ప్రకాష్ జయదేవకర్ రేషన్ బియ్యం పంపిణీ చేశారు. మల్యాల కొత్తపేట ప్రాంతంలోని షాప్ నంబర్ 2307లో వినియోగదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఆయన 36 నెలలుగా ఫ్రీ రేషన్ బియ్యం కేసీఆర్ వి కాదని మోదీ అందజేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ఫ్రీ బియ్యం అందజేసే పథకం ప్రపంచంలోనే ఎక్కడాలేదన్నారు. కరోనా సమయంలో దేశ ప్రజలకు ఆకలి చావులు రాకూడదనే ఉద్దేశంతో మోదీ ఫ్రీ బియ్యం అందజేస్తున్నారని అన్నారు. ఈ రోజు పల్లెల్లో పూర్తిగా డిజిటలైజేషన్ తో ప్రజలు రేషన్ పొoదుతున్నారని, గతంలో కాంగ్రెస్ నాయకుడు చిదంబరం డిజిటల్ ప్రక్రియపై విమర్శలు చేస్తే, మోదీ అసాధ్యంను సుసాధ్యo చేశారన్నారు.