వివాదంలో చిక్కుకున్న మల్లారెడ్డి

వివాదంలో చిక్కుకున్న మల్లారెడ్డి

ముద్ర, మల్యాల: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. కొండగట్టులో అంజన్న దర్శనానికి వెళ్లిన సమయంలో ఆలయంలోకి గన్ మెన్ తో సహా వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాన్ని కూడా భద్రతా సిబ్బంది తీసుకెళ్లారు. దీంతో ఆయన తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతరాలయంలోకి తుపాకీ ఎలా తీసుకొస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.