శాపంగా మారిన గొర్రెల పథకం

శాపంగా మారిన గొర్రెల పథకం
  • దశబ్ది సంబరాల్లో గొడవ చేసిన లబ్ధిదారులు.
  • గొర్రెలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ అంత తిప్పించారాని ఆగ్రహం
  • సరైన సమాధానం ఇవ్వలేక పోయిన అధికారులు

ఖానాపూర్, ముద్ర 9 : ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన గొర్రెల పంపిన పథకం యాదవులకు శాపంగగా మారింది. అధికారులు గొర్రెలు ఇస్తామని చెప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఇక్కడి నుండి కొందరు యాదవులు గొర్రెల కోసం ఆంధ్ర లో తిరిగి ఇబ్బంది పడ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం లోని జేకే పంక్షన్ హల్ లో శుక్రవారం రాష్ట్ర దశబ్ది ఉత్సవ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా  మండలం లోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన పలువురు యాదవులు కార్యక్రమం లో గొడవ చేసారు. వెటర్నరీ అధికారులను నిలదీశారు. లబ్ధిదారులకు, సంబంధిత వెటర్నరీ అధికారులకు  మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఖానాపూర్ మండలం లోని సుర్జాపూర్ గ్రామానికి 18 యూనిట్లు మంజూరి కాగా ఒక్కొక్క యూనిట్ కు దాదాపు రూ. 45 వేలు చొప్పున కలెక్టర్ కు కట్టామని, నెలలు గడిచిన గొర్రెలు మాత్రం రాలేవని లబ్ధిదారులు మల్లేష్ యాదవ్, నర్సయ్య యాదవ్, తోకల నారాయణ యాదవ్, రాజేశ్వర్ యాదవ్, అంగ రాజన్న యాదవ్, రాంపూర్ ఆశన్న యాదవ్, మల్లయ్య యాదవ్, రమేష్ యాదవ్ మరికొందరు తమ ఆవేదన వెళ్ళగక్కారు.

గత నాలుగు రోజుల క్రితం గొర్రెలు కొనిస్తామని సంబందించిన అధికారులు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కు వెళ్లాలని చెప్పటం తో తాము 10 మందిమి కలిసి రెండు కార్లలో గుంటూరుకు పోతే గుంటూరు లో కాదు మాచర్ల కు వెళ్లాలని, మళ్ళీ ఫోన్ చేసి అక్కడ కాదు కడప కు పోవాలని, నాగార్జున సాగర్ కు అని మాచర్ల కు పోవాలని ఇలా ఆంధ్ర అంత తిప్పారని చివరకు మాచర్ల లో బక్కచిక్కిన గొర్రెలు చూపించారాని, అక్కడ మధ్య దళారులు మహారాష్ట్ర కు చెది oదిన చావుకు దగ్గర అయినా ఈ గొర్రెలు తీసుకొనిపోవాలని, ధర కూడా ఎక్కువగా చెప్పారని వారు బాధ తో వివరించారు. తమను అనవసరం గా తిప్పించటంతో చాలా ఇబ్బందులు పడ్డామని వాపోయారు. మేము మళ్ళీ అధికారికి ఫోన్ చేస్తే మీరు అక్కడకు ఎందుకు వెళ్లారని, ఎవరు వెళ్ళమన్నారని తమను ప్రశ్నించటoతో ఆశ్చర్యపోయమని ఆవేదన వెళ్ళగక్కారు. ఇలా తమను ఎందుకు వేదిస్తున్నారని లబ్ధిదారులు ప్రశ్నించారు. తాము కార్లకు ఒక్కొక్క కారుకు రూ. 20 వేల కిరాయి చెల్లించమని, 50 వేల రూపాయలకు పైన ఖర్చు అయిందని అధికారుల పైన మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరారు. వెటర్నరీ అధికారి దీప్తి మాట్లాడుతూ, విషయం పై అధికారులకు తెలియజేసి యూనిట్లు తొందరగా వచ్చే విదంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం ఎ మ్మెల్యేకు తెలియజేయగా అధికారుల పట్టించుకోని వారికి  గొర్రెలు వచ్చేవిదంగా చేయాలని చెప్పారు. తమకు సకాలంలో గొర్రెలు అందజేయాలనీ లబ్ధిదారులు కోరారు.