ఘనంగా పర్యావరణ దినోత్సవం

ఘనంగా పర్యావరణ దినోత్సవం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు అపార్ట్మెంట్లలో ప్లాస్టిక్ వాడకం వల్ల అనర్థాలు, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటం వంటి పలు అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రాజు, సి సి ఇ ప్రతినిధులు అస్రార్, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.