చర్లపల్లిలో బయటపడ్డ పురాతన రాతి  విగ్రహాలు.....  

చర్లపల్లిలో బయటపడ్డ పురాతన రాతి  విగ్రహాలు.....  

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలు గురువారం జరిపిన తవ్వకాలలో  పలు రకాల "రాతి విగ్రహాలు" బయటపడ్డాయి. కాగా అక్కడ విగృహాలు బయటపడ్డాయి అన్న విషయాన్ని తెలుసుకున్న చర్లపల్లి గ్రామస్తులు అక్కడకు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేశారు.  

కాగా ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు  రోజు మాదిరిగానే చర్లపల్లి గ్రామ శివారులో గల "గుట్ట ప్రాంతం లో " ఉదయం ఉపాధి హామీ పనులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రాంతం వద్ద  వారు త్రవ్వకాలు జరుపుతుండగా పలు రకాల "రాతి విగ్రహాలు" బయటపడ్డాయి. దీనితో భయాందోళనకు గురైన వారందరు ఇక్కడ జరిగిన విషయాన్ని సంబంధిత అధికారులకు  తెలియజెశారు. దీనితో వారు అక్కడికి వెళ్లి అక్కడి విగ్రహాలను పరిశీలించారు. కాగా ఆ విగ్రహాలు ఎప్పటివి అనేవి స్పష్టం కావాలంటే పురావస్తు శాఖ వారు వాటిని పరిశీలించాల్సిందేనని గ్రామస్థులు పేర్కొంటున్నారు.