బోర్డులకే పరిమితమైన క్రీడా ప్రాంగణలు..

బోర్డులకే పరిమితమైన క్రీడా ప్రాంగణలు..
  • వినియోగించు కోలేకపోతున్న క్రీడాకారులు..
  • అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని క్రీడాకారులు కోరుచున్నారు...


గొల్లపల్లి. ముద్ర:-గ్రామీణ,ప్రాంతాల్లోయువతను,క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిలోని నైపుణ్యాలను వెలికి తీసి,క్రీడల్లో రాణించేందుకు వీలుగా గత ప్రభుత్వం క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది.కానీ అధికారుల నిర్లక్ష్యం వల్లనా అవి నిరుపయోగంగా ఉన్నాయి.గొల్లపల్లి మండల వ్యాప్తంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు.కానీ కొన్ని పాఠశాల పరిధిలో గతంలో ఉన్న మైదానాలకు బోర్డులు తగిలించారనే విమర్శలు వస్తున్నాయి.బోర్డులు తగిలించిన కనీస సౌకర్యాలు ఏర్పాటు వంటివి లేకపోవడంతో క్రీడా మైదానాలు నిరుపయోగంగా మారాయిని.కొన్ని క్రీడా మైదానాల్లో రెండు పోల్స్,ఎక్సర్‌సైజ్‌ బార్‌లను ఏర్పాటు చేసి వదిలేశారు.

ఆటలు ఆడే పరిస్థితి లేదని.చాలా చోట్ల ప్రాంగణాలు చెట్లు,పిచ్చిమొక్కలు రాళ్లు రప్పలతో ఇబ్బందికరంగా ఉన్నాయి.మండల అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందికరంగా మారాయిని.క్రీడా మైదానాలకు కేటాయించిన లక్షల ఖర్చు వృధా  అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు పెద్ద పెద్ద బోర్డులు మాత్రం తగిలించారు.కానీ క్రీడా ప్రాంగణాలో అవసరమైన క్రీడా సామాగ్రి,వసతులు కల్పించలేదన్న వాదనలోస్తున్నాయి.కొన్ని క్రీడా ప్రాంగణాలకు క్రీడాకారులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉందని.అరకొర ఏర్పట్లతోనే అధికారులు పలు బిల్లులు చెల్లించినట్లు  చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా క్రీడా ప్రాంగణాలను అధికారులు పట్టించుకోవాలని  క్రీడాకారులు కోరుచున్నారు.