అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అన్నా హజారే

అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అన్నా హజారే

ముద్ర,సెంట్రల్ డెస్క్:- మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్ అయ్యారని అన్నారు. తనతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్.. లిక్కర్ పాలసీలు రూపొందించారని మండిపడ్డారు. తన స్వలాభం కోసం పాలసీలు చేశారు కాబట్టి ఈడీ అరెస్ట్ చేసిందని హజారే పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పని చేసినందుకు తాను సిగ్గుపడుతున్నానని ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ పరిస్థితి చూసి తను బాధగా అనిపించడం లేదని వ్యాఖ్యానించారు.