రెజ్లర్​కు చెంపదెబ్బ.. హత్య చేశాను!: బ్రిజ్​భూషణ్​

రెజ్లర్​కు చెంపదెబ్బ.. హత్య చేశాను!: బ్రిజ్​భూషణ్​

న్యూఢిల్లీ: రెజ్లర్ల ధర్నాలో పాల్గొన్న ఓ రెజ్లర్​ను డబ్ల్యూఎఫ్​ఐ అధ్యక్షుడు బ్రిజ్​భూషణ్​ చెంపదెబ్బ కొడుతున్న వీడియో ఒకటి వైరల్​గా మారింది. దీంతో విపక్షాలు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అంతేగాక అతను గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఓ హత్య చేసినట్లు ఒప్పుకోవడం కూడా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిజ్​భూషణ్​పై చర్యలు తీసుకోవాలని తాజాగా డిమాండ్​లు ఊపందుకున్నాయి.