బుట్ట బొమ్మ కలర్ ఫుల్ గా ఉంటుంది - అనిక సురేంద్రన్

బుట్ట బొమ్మ కలర్ ఫుల్ గా ఉంటుంది - అనిక సురేంద్రన్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ నుంచి 'బుట్ట బొమ్మ' అనే మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు.  జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా నటి అనిక సురేంద్రన్ విలేకర్ల సమావేశంలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు. ఎన్నో ఏళ్లుగా బాల నటిగా సినిమాల్లో నటిస్తూ వచ్చాను. ఇప్పుడిలా హీరోయిన్ గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కప్పేల మలయాళ వెర్షన్ చూశాను.. చాలా నచ్చింది. 

ఇంతలోనే ఆ ఫిల్మ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం ఆనందం కలిగించింది. ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, నటనకు ఆస్కారం ఉంది. అప్పటికే ఈ సినిమా ఒరిజినల్‌ చూసి ఉన్నాను. నాకు ఎంతో నచ్చిన ఆ సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. పైగా సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తోంది. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాను. మూల కథ అలాగే ఉంటుంది. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంటుంది.