కథకు తగ్గట్టుగా యాక్షన్‌సీన్స్‌ ఉంటాయి- భరత్‌

కథకు తగ్గట్టుగా యాక్షన్‌సీన్స్‌ ఉంటాయి- భరత్‌
sudeer babu hunt telugu movie updates

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించారు. ఇందులో తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రలో నటించారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన... తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశారు. ఇందులో ఆయనది పోలీస్ రోల్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో ముచ్చటించారు. నా మెయిన్ స్ట్రీమ్ తమిళ్. సో... అక్కడి సినిమాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశా. వరుసగా అవకాశాలు వచ్చాయి. తమిళ సినిమాలతో బిజీగా ఉన్నా. 

దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. పైగా... సుధీర్ బాబు నాకు మంచి ఫ్రెండ్. కథ మా ముగ్గురి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా. నేను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. 'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది. కథ ప్రధానంగా హైదరాబాద్ లోనే నడుస్తుంది. కొన్ని యాక్షన్ పార్ట్స్ హైదరాబాద్ సహా పారిస్ లో కూడా షూట్ చేశాం. కథకు సూటయ్యేలా, స్క్రీన్ ప్లేకు కనెక్టయ్యేలా యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు.