మణికొండకు మరో మణిహారం రమేష్ స్టూడియో

మణికొండకు మరో మణిహారం రమేష్ స్టూడియో

యువ నిర్మాత డి.రమేష్ బాబు, రమేష్ స్టూడియోస్ పేరుతో గురువారం మణికొండలో ఒక  స్టూడియోను ప్రారంభించారు. కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోగా, చిన్నా, పెద్ద అన్ని సినిమాల నిర్మాతలకి అందుబాటు ధరలతో...అత్యాధునిక సాంకేతిక నిర్మాణంతో తాము ఈ స్టూడియో ని ప్రారంభించామన్నారు.

స్టూడియో  ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  ప్రముఖ నిర్మాత సి .కళ్యాణ్, బసిరెడ్డి, ప్రసన్నకుమార్, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, నిర్మాత రామ సత్యనారాయణ, దర్శకుడు  రేలంగి నరసింహ రావు, వల్లభనేని  అనిల్, తదితరులు  పాల్గొని రమేష్ బాబుకి తమ అభినందనలు  తెలియజేసారు. ప్రస్తుత సినీ రంగ అభివృద్ధికి ,పెరిగిన సినిమాల నిర్మాణానికి ఇలాంటి స్టూడియోల అవశ్యకత ఎంతైనా ఉందన్నారు...ఇందుకు రమేష్ బాబు అభినంనీయుడని వారు అన్నారు.