చివరి టెస్టులో పట్టు బిగిస్తున్న ఆస్ట్రేలియా 

చివరి టెస్టులో పట్టు బిగిస్తున్న ఆస్ట్రేలియా 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని చివరి టెస్టు మ్యాచ్‎లో ఆస్ట్రేలియా జట్టు పట్టుబిగిస్తోంది. ఇండియా–  ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో  టెస్టు మ్యాచ్‎లో ఆసీస్ జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.  రెండో రోజు లంచ్ సమయానికి 119 ఓవర్లు ముగిసేరికి 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అంతకుముందు ఆసీస్ ఓవర్ నైట్ స్కోర్ 255/4తో రెండో రోజు బ్యాటింగ్‎కు దిగిన ఆసీస్ బ్యాటర్లు వికెట్ పడకుండా నిలకడగా ఆడుతున్నారు. వికెట్ల కోసం భారత్ బౌలర్లు ఎంత కష్టపడినా ఎటువంటి చాన్స్ ఇవ్వకుండా దూకుడుగా ఆడుతున్నారు. తొలి రోజు సెంచరీతో కదం తొక్కిన ఉస్మాన్ ఖవాజా రెండో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ..354 బంతుల్లో 20 ఫోర్లతో 150 రన్స్ చేశాడు.  దూకుడుగా ఆడుతున్న మరో బ్యాటర్ కూడా కామెరూన్​ గ్రీన్  సెంచరీకి ఐదు పరుగుల దూరంలో ఉన్నాడు. 135 బంతుల్లో 15 ఫోర్లతో 95 రన్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి.. రెండో రోజు తొలి సెషన్ లో ఆసీస్ వికెట్ నష్టపోకుండా 88 పరుగులు చేసింది.