కాసేపట్లో డబ్ల్యూ డబ్ల్యూ ఈ సూపర్ ఫైట్

కాసేపట్లో డబ్ల్యూ డబ్ల్యూ ఈ సూపర్ ఫైట్
  • అంతర్జాతీయ సూపర్‌ఫైట్‌ ‘డబ్ల్యూడబ్ల్యూఈ’కి హైదరాబాద్‌ ఆతిథ్యం
  • నేడు గచ్చిబౌలి స్టేడియంలో సమరం

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ (డబ్ల్యూ డబ్ల్యూ ఈ) పోటీకి హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వేదిగా కానుంది. హైదరాబాద్‌ వేదికగా తొలిసారి వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్లూడబ్ల్యూఈ) శుక్రవారం సాయంత్రం జరగనుంది.  ఈ సూపర్‌ ఫైట్‌లో 28 మంది అంతర్జాతీయ చాంపియన్స్‌ పోటీ పడనున్నారు.  ఇన్నాళ్ళు ఇలాంటి భీకర పోరును టీవీల్లోనే వీక్షించి ఆనందపడవాళ్ళం. ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం మనకు కలిగింది. దీంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అంటే ఈ క్రీడకు ఉన్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.  ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్‌ చాంపియన్‌ సేథ్‌ ఫ్రీకిన్‌ రోలిన్స్‌, ఉమెన్‌ ప్రపంచ చాంపియన్‌ రియా రిప్లే, డబ్ల్యూడబ్ల్యూఈ టాగ్‌ టీం చాంపియన్‌ సమీజైన్‌ తదితర సూపర్‌ స్టార్స్‌ పోటీపడుతున్నారు. డబ్లూ డబ్ల్యూ ఈ అంటేనే రసవత్తరమైన ఫైట్. క్షణం క్షణం ఉత్కంఠ, ఎవరు గెలుస్తారో చెప్పలేం. నువ్వానేనా అన్నట్లుగా తలపడతారు, గాయాలను సైతం లెక్కచేయరు.

హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. సెప్టెంబర్ 8 అంటే నేటి సాయంత్రం డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్‌ను గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ  సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రపంచ దేశాల్లో ఎంతో ఆదరణ పొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ తొలిసారి హైదరాబాద్ లో జరగబోతుండడంతో నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి లైవ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియప్ రియా రిప్లే, సమీ జైన్, కెవిన్ ఓవెన్స్ తదితర రెజ్లింగ్ స్టార్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

భారత్ లో తొలిసారిగా జాన్ సెనా
ఇప్పటికే 16 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జాన్ నెనా హైదరబాద్ (గచ్చిబౌలి)లో జరగనున్న ఈవెంట్ లో మొదటిసారి పాల్గొంటున్నారు. భారత్ పర్యటన ఆయనకు ఇది రెండోసారి. 2006లో మొదటిసారి భారత్ పర్యటనకు వ్చచిన జాన్ సెనా ముంబాయిలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ కు వస్తున్నారు.  ఈ సందర్భంగా  భారత్ లో డబ్ల్యూ డబ్ల్యూ ఈ అభిమానులను కలవడానికి తాను ఉత్సాహంగా ఉన్నానని జాన్ సెనా వెల్లడించారు.