భువీ బౌలింగ్ ఎదుర్కోవటం కష్టం 

భువీ బౌలింగ్ ఎదుర్కోవటం కష్టం 
  • ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌

న్యూఢిల్లీ: భారత స్వింగ్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడినట్టు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ తెలిపాడు. ‘భువీ మిమ్మల్ని ఎందుకు ఇబ్బందిపెట్టాడు? వివరించగలరా?’ అని ట్విటర్‌లో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘అవును. అలా జరగకుండా ఉండేందుకు 15 ఏళ్లు ప్రయత్నించాను’ అని ఫించ్‌ ట్వీట్‌ చేశాడు. 2019లో భువీని ఎదుర్కొన్న నాలుగు వన్డేల్లో ఓపెనర్‌ ఫించ్‌ కేవలం 6,6,14,0 పరుగులకే అవుటయ్యాడు.