ఐపీఎల్  కొత్త  రూల్స్

ఐపీఎల్  కొత్త  రూల్స్

క్రికెట్ వినోదాన్ని అందించడం కోసం మరోసారి ఐపీఎల్ రంగం సిద్ధమైంది. ఐపీఎల్ మజాను అందించడం కోసం పది జట్లు సిద్ధం అయ్యాయి. అయితే, ఈసారి ఐపీఎల్ సీజన్ కాస్త కొత్తగా కనిపించనుంది. అందుకు కొన్ని కొన్ని కీలక మార్పులు చేసింది బీసీసీఐ.

5 రన్స్ పెనాల్టీ..
గ్రౌండ్ లో ఉన్న ఫీల్డింగ్ జట్టు బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డర్ గానీ, వికెట్ కీపర్ గానీ కదిలితే.. ఫీల్డింగ్ జట్టుకు 5 పరుగులు జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా ఆ బంతిని డెడ్ బాల్ గా ప్రకటిస్తారు. నిర్ణీత టైంలోగా ఓవర్లు పూర్తి చేయకపోయినా, థర్టీయార్డ్ సర్కిల్ బయట ఐదు ప్లేయర్లకు బదులుగా నలుగురినే అనుమతిస్తారు.

వైడ్, నోబాల్ రివ్యూ..
బ్యాట్స్ మెన్ ఔటా? నాటౌటా? అని తెలుసుకోవడానికి మాత్రమే ఇప్పటి వరకు డిసిషన్ రివ్యూ తీసుకునేవాళ్లు. అయితే, ఈ సీజన్ నుంచి ఆ రూల్ లో మరికొన్నింటిని యాడ్ చేశారు. ఈ ఐపీఎల్ లో వైడ్, నో బాల్ కు కూడా రివ్యూ తీసుకునే అవకాశాన్ని కల్పించారు. దీనివల్ల నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిన బాల్ ని నోబాల్‌గా ప్రకటించే విషయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.