మేడ్చల్ లో  బీజేపీ గెలుపు ఖాయం...

మేడ్చల్ లో  బీజేపీ గెలుపు ఖాయం...
  • మంత్రి మల్లారెడ్డికి ఈ సారి ఓటమి తప్పదు ...
  • బిజెపి మహారాష్ట్ర ఎమ్మెల్యే మేఘ్నా దీపక్ సాకోర్ బోర్డికర్

ముద్ర ప్రతినిధి, మేడ్చల్:రాబోయే ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కోట్ల రూపాయలు వెదజల్లినా  ఈ సారి ఆయన ఆటలు సాగవని, ఓటమి తప్పదని బిజెపి మహారాష్ట్ర జింటూర్ ఎమ్మెల్యే మేఘ్నా దీపక్ సాకోర్  బోర్డికర్   అన్నారు. త్వరలో తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇక్కడ బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజల మనోభావాలను తెలుసుకునే  ప్రక్రియలో  భాగంగా,(  విధాన సభ ప్రజ్ఞాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ) ఆమె ఈ నెల 20 న ఇక్కడకు వచ్చి మేడ్చల్ నియోజక వర్గం లోని వివిధ ప్రాంతాల్లో ఆరు రోజుల పాటు పర్యటించి, సభలు, సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపద్యంలో, శుక్రవారం  ఆమె  మేడ్చల్ నియోజక వర్గంలోని ఫిర్జాదిగూడ  లో,  మేడ్చల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శులు తిరుమలరెడ్డి, విజయ కుమార్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, మంత్రి మల్లారెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విడమరిచి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అందులో ముఖ్యంగా, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తొలగింపు, మేడ్చల్ లో రైల్వే అండర్ పాస్ నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం, నిరుద్యోగులకు ఉపాధి కల్పన లాంటి విషయాలలో మంత్రి ఘోరంగా విఫలమయ్యాడని  దుయ్య బ ట్టారు.దీనితో ప్రజల్లో మంత్రి మల్లారెడ్డి పట్ల  తీవ్ర వ్యతిరేకత ఉందని, దీనిని తన పరిశీలనలో స్పష్టంగా గుర్తించామని మేఘన వెల్లడించారు.  ఎన్ని జిమ్మిక్కులు చేసినా మల్లారెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కోల్పోయారని ఆమె ఏద్దేవా చేశారు. ఆయన తన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఎంత మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. మరోవైపు బిజెపి చివరి వరకు దేశం  కోసమే ఆలోచన చేస్తుందని, ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్ళినా ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు.  

ప్రధానిగా మోడీ వచ్చిన తర్వాత అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అంతేకాకుండా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో పేదల కోసం ప్రవేశ పెట్టిన వాంభే గృహ నిర్మాణ పథకం, గ్రామ సడక్ యోజన లాంటి పథకాలు ప్రజలకు ఎంతగానో మేలు చేశాయన్నారు. మోడీ ప్రవేశ పెట్టిన పథకాలు ఇతర రాష్ట్రాల్లో  జరుగుతున్నట్టు ఇక్కడ జరగటం లేదని ఆమె ప్రభుత్వ కుటిల నీతి ని ఎత్తి చూపారు. విద్యార్థుల కోసం, అలాగే, ఫైనాన్స్ కమీషన్ ల ద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులను  మంజూరు చేస్తున్నదని, ఇందులో సఫాయి కర్మచారీలకు ఇస్తున్న ఫండ్స్ కూడా ఉందని ఆమె గుర్తు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధాని  మోడీ చేపడుతున్న చర్యలు  అందరికీ తెలుసనీ, మోడీ మాత్రమే ఈ దేశ సంక్షేమానికి  కృషి చేస్తున్నారని ఆమె చెబుతూ, జిల్లా ప్రజలు ఈ సారి బిజెపి కే  ఓటు వేస్తారని  ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బిజెపి మహారాష్ట్ర స్పోక్స్ పర్సన్ డా: ఉమేష్ దేష్ ముఖ్, మహారాష్ట్ర  బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ బూమ్రే, మేడ్చల్ రూరల్ జిల్లా ఇన్చార్జి వేముల నరేందర్, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు గోనె శ్రీనివాస్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్  బిజెపి అధ్యక్షులు అనిల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాసాల నర్సింగ్ రావు, జిల్లా కార్యదర్శులు తలారి రవి యాదవ్, ప్రగతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు ఏనుగుల లక్ష్మయ్య, యువమోర్చా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జై కిషన్, బోడుప్పల్ కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి వివిధ మోర్చల నాయకులు తదితరులు పాల్గొన్నారు.