ప్రచారం లో దూసుకెళుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి... సతీమణి  సునీత

ప్రచారం లో దూసుకెళుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి... సతీమణి  సునీత
  • కాలినడకన తిరుగుతూ సూర్యాపేట పట్టణమంతా  ప్రచారం 
  • అభివృద్ధికి అండగా ఉండాలంటూ వేడుకోలు
  • సునీతమ్మ ప్రచారానికి అండగా ఆశేష జనవాహిని 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-బీఆర్‌ఎస్‌ సూర్యాపేట నియోజవర్గ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి మద్దతుగా ఆయన సతీమణి సునిత ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. 3 వ వార్డ్ లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సూర్యాపేట  లొ మంత్రి  గా జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.20 రోజులుగా సూర్యాపేట పట్టణం నలువైపులా కాలినడకన సునీత జగదీష్ రెడ్డి నిర్వాహిస్తున్న  ప్రచారానికి పట్టణ బ్రహ్మరథం పట్టారు. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధికి అండగా ఉంటారంటూ ప్రచారంలో ప్రజలను వేడుకున్న ఆమె మళ్లీ ఆశీర్వదిస్తే సూర్యాపేటలో చేయబోయే అభివృద్ధి తన ప్రచారాన్ని నిర్వహించారు.