ఎమ్మెల్యే పద్మ నివాసంలో బతుకమ్మ సందడి

ఎమ్మెల్యే పద్మ నివాసంలో బతుకమ్మ సందడి

ముద్ర ప్రతినిధి, మెదక్:ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నివాసంలో బతుకమ్మ సందడి నెలకొంది. ఆదివారం పెద్ద (సద్దుల) సందర్బంగా మెదక్ లోని అధికారిక నివాసంలో కుటుంబ సభ్యులు,  బంధువులతో కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. ఈ సందర్భంగా బతుకమ్మను పూలతో అలంకరిస్తూ లయబద్ధంగా పాటలు పాడుతూ గౌరమ్మను కొలిచారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే సొంతమన్నారు. పూలను దేవతగా కొలవడం గొప్ప సాంప్రదాయానికి నిదర్శనమన్నారు. తోటి మహిళా సోదరీమణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ నిమజ్జన సమయంలో చెరువులు, కుంటలు, కాలువల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు.