తూర్పు గూడెం గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగకు హాజరైన సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు

తూర్పు గూడెం గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగకు హాజరైన సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు
  • తుంగతుర్తి మండలం లో ఘనంగా సద్దుల బతుకమ్మ పండగ

తుంగతుర్తి ముద్ర:-సద్దుల బతుకమ్మ పండుగను తుంగతుర్తి మండలం లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు .ఎనిమిది రోజులుగా బతుకమ్మలను పేర్చి గౌరమ్మ పూజలు చేసిన మహిళలు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి తొమ్మిది రకాల సద్దులను నైవేద్యంగా పెట్టి సాయంత్రం బతుకమ్మలను తీసుకుని ఆయా గ్రామాలలోని చెరువుల వద్దకు చేరుకున్నారు. బతుకమ్మలన్నింటిని ఒక్క  దగ్గర చేర్చి రకరకాల పాటలతో ఆటలతో గౌరమ్మను పూజించారు. సద్దుల బతుకమ్మతో పండుగ ఆదివారంతో ముగియనుండగా పట్టణాల నుండి నగరాల నుండి మహిళలు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్నారు.

గ్రామాలు బతుకమ్మ పండుగ సంబరాలతో నిండిపోయాయి. తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామంలో సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు సద్దుల బతుకమ్మను తమ ఇంటి నుండి తెచ్చి గ్రామ మహిళలతో కలిసి ఆటలు ఆడి పాటలు పాడారు.  సద్దుల బతుకమ్మ సంబరాలు గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకున్నారు.