భూకబ్జాలపై భగ్గుమన్న బిజెపి

భూకబ్జాలపై భగ్గుమన్న బిజెపి

కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో అన్యాక్రాంతమవుతు, కబ్జాకు గురవుతున్న  ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ బిజెపి కరీంనగర్ అసెంబ్లీ బిజెపి శ్రేణులు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతలు మాట్లాడుతూ కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని తీగల గుట్టపల్లి, బొమ్మకల్, కొత్తపల్లి, బావు పేట, ఎలగందుల తో పాటు పట్టణంలోని అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతూ కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. లోగడ బిఆర్ఎస్ ప్రభుత్వ అండదండలతో బిఆర్ఎస్ నేతలు కొందరు కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేశారనన్నారు. భూ కబ్జాలకు పాల్పడిన బి ఆర్ ఎస్ నేతల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తుందనన్నారు. ప్రధానంగా సీతారాంపూర్ లోని 71 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అంశం వివాదాస్పదంగా మారిన నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా అలసత్వం విడాలని, అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను రక్షించడానికి , భూ బకాసురుల నుండి కరీంనగర్ ను కాపాడడానికి తగిన చర్యలు చేపట్టాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇట్టి నిరసన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపురమేష్, మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ , జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర ,జానపట్ల స్వామి, సుధాకర్ పటేల్, ఎడమ సత్యనారాయణ రెడ్డి, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, కార్పొరేటర్లు పెద్దపల్లి జితేందర్, కోలగాని శ్రీనివాస్, దురిశెట్టి అను ప్, చొప్పరి జయశ్రీ, నాగసముద్రం ప్రవీణ్, బండ రమణారెడ్డి, ఎన్నం ప్రకాష్ ,  మాజి ఎంపీపీ వాసాల రమేష్ , పాదం శివరాజ్, పురం హరి ,లడ్డు ముందడ,  శ్రీనివాస్, అనిల్, బల్బీర్ సింగ్, లడ్డు ముందడ, రమణ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.