రాజాపేట లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు

రాజాపేట లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు

చర్యలకు పలువురి ఫిర్యాదులు

రాజాపేట, ముద్ర : రాజపేట మండల కేంద్రంలో గత ఐదు సంవత్సరాల నుండి గ్రామపంచాయతీ పరిధిలో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో నిర్లక్ష్యం తోపాటు మద్దతు పలకడంతో గత ఐదు సంవత్సరాలు అక్రమ నిర్మాణాలు తప్పుడు నిర్ణయాలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ విషయంపై సంబంధిత మండల జిల్లా అధికారుల సైతం పట్టించుకోకపోవడంతో ప్రజలు నాయకులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రమైన రాజాపేట లో గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న పొరపాట్లపై విచారణ జరపాలని చర్యలుతీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జరిగిన అక్రమ నిర్మాణంలో స్పందించిన కార్యదర్శి రేకులపల్లి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కూల్చివేతలు చేపట్టారు.