కదిరేనిగూడెంలో ఘనంగా చెరువుల పండుగ

కదిరేనిగూడెంలో ఘనంగా చెరువుల పండుగ

మోటకొండూర్ ముద్ర న్యూస్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది  ఉత్సవాల్లో నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఊరూర చెరువుల పండుగలో భాగంగా గురువారం మోట కొండూరు మండలం కదిరేణిగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని గ్రామ పండుగా  జరుపుకున్నారు.

చెరువు కట్టపై  గురువారం నిర్వహించారు. గ్రామ ప్రజలు ఊరేగింపుగా చెరువు కట్ట పైకి బోనాలతో వచ్చారు. కట్ట మైసమ్మ కి బోనాలు సమర్పించారు.అనంతరం మైసమ్ బావి వద్ద బతుకమ్మలాడారు. రాత్రి గ్రామ ప్రజలంతా అక్కడే విందు భోజనం ఆరగించారు. గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని వారందరికీ గ్రామ సర్పంచి వేముల పాండు కృతజ్ఞతలు తెలిపారు.