సిద్దిపేట జిల్లా కుమ్మరి సంఘం వారిచే

సిద్దిపేట జిల్లా కుమ్మరి సంఘం వారిచే

 కేసిఆర్,హరీష్ రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: ప్లాస్టిక్ భూతం రాకతో కనుమరుగు దశకు చేరుకున్న కుమ్మరి వృత్తికి అండగా నిలుస్తున్న సీఎం కేసిఆర్,మంత్రి హరీష్ రావుకి సిద్దిపేట జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షుడు దరిపల్లి శ్రీను కృతజ్ఞతలు తెలిపారు.సిద్దిపేటలో కుమ్మరి మోడల్ ప్రాజెక్ట్ కు రూ. 2 కోట్ల 20 లక్షలు కేటాయించిన సందర్భంగా ఆదివారం నాడు  సిద్దిపేట అంబేడ్కర్ సర్కిల్ వద్ద కుమ్మరి సంఘం  ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా దరిపల్లీ శ్రీను మాట్లాడుతూ 60 ఏళ్ల సమైక్య పాలనలో కుమ్మరి వృత్తిని ఆదుకునే చర్యలు చేపట్టలేదని తెలిపారు.దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే కులవృత్తులు మళ్ళీ పునర్జీవం పోసుకుంటున్నాయని వివరించారు. అంతరించి పోతున్న దశలో ఉన్న కుమ్మరి వృత్తిని సర్కార్ ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.ఈ ప్రాజెక్ట్ వల్ల 800 కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని హర్షం వ్యక్తం చేశారు.