ఆకాశవాణి భవన్ చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం - ప్రధాన ఎన్నికల కమిషనర్

ఆకాశవాణి భవన్ చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం - ప్రధాన ఎన్నికల కమిషనర్

వేదికపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనపై విలేకరుల సమావేశం ప్రారంభం.

రాజీవ్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్.

40 రోజుల కసరత్తులో 5 రాష్ట్రాల్లో పర్యటించాం.

ఎన్నికల ప్రక్రియలో భాగమయ్యే అన్ని విభాగాలను సంప్రదించాం.

రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా కలిసి వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం.

ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

మొత్తం దేశంలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పోల్చితే 1/6వ వంతు.

ఓటర్ల సంఖ్య ప్రకారం చూసినా సరే 1/6 వ వంతు జనాభా ఈ రాష్ట్రాల్లో ఉన్నారు.

ఈ రాష్ట్రాల్లో 60.20 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు.