చంద్రగిరి ఎమ్మెల్యే నాని మానవత్వం

చంద్రగిరి ఎమ్మెల్యే నాని మానవత్వం

చంద్రగిరి, ముద్రవార్తలు: చంద్రగిరికి శాసనసభ్యుడు పులివర్తి నాని మానవత్వం చాటుకున్నారు. తిరుపతి జాతీయ రహదారిపై టమోటాల లోడుతో ప్రయాణిస్తున్న ఒక లారీ బోల్తాపడిన ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ దారిలో వెళ్తున్న ఎమ్మెల్యే నాని గాయపడిన డ్రైవర్ లారీ కేబిన్ లో ఉండటాన్ని గుర్తించారు. స్థానికుల సాయంతో డ్రైవర్ ను బయటకు తీయించి, అతణ్ని తన కారులో ఆస్పత్రికి చికిత్సకు పంపించి మానవత్వం చాటుకున్నారు.