సొంత గూటికి కోరుట్ల కౌన్సిలర్ గంధం గంగాధర్

సొంత గూటికి కోరుట్ల కౌన్సిలర్ గంధం గంగాధర్

ముద్ర, కోరుట్ల: గత వారం రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోరుట్ల 20వ కౌన్సిలర్ గంధం గంగాధర్ తిరిగి తన సొంత గూటికి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా గంగాధర్ మాట్లాడుతూ కొన్ని ప్రలోభాలకు లొంగి మాయమాటలు చెప్పి తనని బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం చేశారని తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంతవరకు సంజయ్ అన్న వెంటే నడుస్తానని తండ్రి లాంటి విద్యాసాగర్ రావు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.