కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్.. ఇద్దరికి గాయాలు

కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్.. ఇద్దరికి గాయాలు

కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నారు. కోస్ట్ గార్డ్ ట్రైనింగ్ సెషన్ లో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  ట్రైనింగ్ ఫ్లైట్ కోసం నెడుంబస్సేరి విమానాశ్రయం రన్ వే నుంచి టేకాఫ్ తీసుకునే ప్రయత్నంలో ఈ ఘటన మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

అయితే రన్ వేకు  ఐదు మీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో రన్ వేను తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను అక్కడి నుంచి తరలించిన వెంటనే రన్‌వే తెరుచుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.  ‘‘ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన ఏఎల్ హెచ్ ధృవ్ మార్క్ 3 హెలికాప్టర్ ను పైలట్లు పరీక్షిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో హెలికాప్టర్ సుమారు 25 అడుగుల ఎత్తులో ఉంది. ఏఎల్ హెచ్ ధృవ్ ఫ్లీట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఐసీజీ కృషి చేస్తోంది’’అని ఐసీజీ అధికారులు తెలిపారు.