గంజాయి పట్టి వేత

గంజాయి పట్టి వేత

ఇద్దరిపై కేసు నమోదు
ముద్ర,వీణవంక: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి పోలీసులు తనిఖీ చేయగా  వారి వద్ద 1 కేజీ గంజాయి లభించిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... మండలం లోని చల్లూరు గ్రామ శివారులో  వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్  పై వెళ్తున్న ఘన్ముక్ల గ్రామానికి చెందిన బొంగోని సాయి,మామిడాలపల్లి గ్రామానికి చెందిన రంజిత్ రెడ్డి ని అదుపులోకి తీసుకొని  వారి వద్ద లభించిన గంజాయి ని  తహశీల్దార్  రాజయ్య  ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.