పొగమంచుతో రాకపోకలకు ఇబ్బంది...

పొగమంచుతో రాకపోకలకు ఇబ్బంది...

గొల్లపల్లి.ముద్ర:  దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జగిత్యాల నుండి ధర్మారం వెళ్లే రహదారిపై  కొద్ది సేపు వాహనాదారులకు గ్రామాలలో రైతులకు దట్టమైన పొగ మంచు వలన రాకపోకలకు ఇబ్బందికరం గా మారింది.

ముందున్న వ్యక్తి కూడాకనిపించనంతగా దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో వాహనాలు,నెమ్మదిగావెళ్లారు. ఉదయం 9 గంటల తర్వాత మబ్బు తెరలు విడిపోవడంతో వాహనదారులు యధావిధిగా పోయినారు. గ్రామంలో ప్రజలు తమతమ పొలం పనులకు వెళ్లారు.