డీ.ఆర్.సి పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

డీ.ఆర్.సి పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఎన్నిక అధికారి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా మెదక్  ప్రభుత్వ బాలుర  జూనియర్  కళాశాల లో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ సెంటర్ ను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు. 

ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణ సాఫీగా జరిగేలా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వెంట ఆర్డీఓ, అంబదస్ రాజేశ్వర్, తహశీల్దార్ శ్రీనీవాస్, డిఎస్పి పణీంధర్ తదితరులున్నారు.100 శాతం పోలింగ్ సాద్దిద్దాం సాధారణ ఎన్నికల్లో భాగంగా  శుక్రవారం మెదక్ నియోజక వర్గం పాపన్నపపేట్ మండలoలోని కొత్తపల్లి ,యూసుఫ్ పేట, గ్రామాలలో ఓటరు నమోదు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ  రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు.ఈ సందర్భంగా గా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 100 శాతం ఓటింగ్ లక్ష్యంతో అధికారులు పని చేయాలని  ఆదేశించారు.ఈ కార్యక్రమంలో  ఆర్ డి ఓ అంబదాస్ రాజేశ్వర్, డిఎస్పి.ఫణిoధర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, స్థానిక తహశీల్దార్ లక్ష్మణ్ బాబు,  సంస్కృతిక శాఖ కళాకరుల ఆట పాటతో అలరించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.