Home Voting - తెలంగాణలో మే 3, 4న వృద్ధులకు హోం ఓటింగ్‌..

Home Voting - తెలంగాణలో మే 3, 4న వృద్ధులకు హోం ఓటింగ్‌..

ముద్ర,తెలంగాణ:- హైద‌రాబాద్ లో 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు ఇంటింటికి ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు.. మే 3, 4 తేదీల్లో ఎన్నిక‌ల సిబ్బంది వారి వారి గృహాల‌కు వెళ్లి ఓట్ల‌ను స్వీక‌రిస్తార‌ని చెప్పారు.. హైద‌రాబాద్ లోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నియోజకవర్గంలో 22 లక్షల 17 వేల 94 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. వీరిలో 11,25,310 మంది పురుషులు, 10,91,587 మంది మహిళలు, 107 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు.