రైతులకు భోనస్ ఇవ్వాల్సి వస్తుందనే, కొనుగోళ్లలో నిర్లక్ష్యం : ఎంపీ అభ్యర్థి బోయిన్ పెల్లి వినోద్

రైతులకు భోనస్ ఇవ్వాల్సి వస్తుందనే, కొనుగోళ్లలో నిర్లక్ష్యం : ఎంపీ అభ్యర్థి బోయిన్ పెల్లి వినోద్

ముద్ర, మల్యాల: మండలంలోని మల్యాల, మానాల, తక్కళ్లపల్లి, లంబాడిపెల్లి గ్రామాల్లో గురువారం కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ పర్యటించారు. అనంతరం పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులను కలిశారు. మల్యాల క్రాస్ రోడ్డు వద్ద గల ధాన్యం కొనుగోలు కేంద్రంను సందర్శించి ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు క్వింటాలుకు రూ 500ల భోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయగా, రైతులకు భోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తుందని, కొనుగోళ్లు ఆలస్యం చేస్తే రైతులు విధిలేని పరిస్థితులల్లో దళారులకు అమ్ముకుని నష్టపోతారని వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంబించాలని డిమాండ్ చేశారు. 

రైతులకు కనీస మద్దతు ధరతో పాటు భోనస్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీటీసి రాంమోహన్ రావు, మాజీ సర్పంచ్ సుదర్శన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, రామడుగు పీఏసీఎస్ చైర్మన్ వీర్ల వేంకటేశ్వర రావు, సాగర్ రావు, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.