చోరీలపై గ్రామస్థులకు పోలీసుల అవగాహన

చోరీలపై గ్రామస్థులకు పోలీసుల అవగాహన

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ మండలంలోని గొల్లగూడెం, ముగ్ధుంపల్లి గ్రామాలలో పోలీసులు గురువారం దొంగతనాలపై గ్రామస్థులను అప్రమత్తం చేశారు. ప్రస్తుత వేసవి కాలంలో గాలికోసం ఎక్కువగా ఇళ్ల తలుపులు తెరిచివుండడం, రాత్రిళ్లు వాకిళ్లలో మంచాలు వేసుకుని నిద్రపోవడం చేస్తుంటారు.

ఈ కాలంలో దొంగలు నిద్రపోతున్న మహిళల మెడల్లోంచి బంగారు ఆభరణాలను దొంగిలించుకుపోవడం, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డం వంటివి చేస్తుంటారని బీబీనగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్.రమేష్ తెలిపారు. అందువల్ల గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా అవగాహన కల్పించారు. అలాగే రైతులు ఆరుబయట కట్టివుంచే పశువులు, కోళ్లు, మేకల వంటి వాటి విషయంలోనూ జాగ్రత్త గా ఉండాలని సూచించారు.