భువనగిరిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

భువనగిరిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు
  • కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి
  •  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి
  • జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
  • జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, డీసీపీ రాజేష్ చంద్ర

ముద్ర ప్రతినిది, భువనగిరి: తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.

తదుపరి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి, ప్రగతి కార్యక్రమాలపై ప్రసంగించారు. తదుపరి అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.

అవతరణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, డీసీపీ రాజేష్ చంద్ర, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి,

జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ అమరేందర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిస్టయ్య, ఎంపిపి నరాల నిర్మల, జడ్పీటిసి బీరు మల్లయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.