శానిటేషన్ కార్మికుల పోరాటానికి న్యూ డెమోక్రసీ మద్దతు.....

శానిటేషన్ కార్మికుల పోరాటానికి న్యూ డెమోక్రసీ మద్దతు.....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా. శానిటేషన్ పనులకు ఉపయోగపడే సరుకులను అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సదర్ కాంట్రాక్టర్ పై సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఇక్కిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం నాడు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన కార్మికుల శిబిరానికి వెళ్లి సంఘీభావం ప్రకటించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్ట్. ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి శాశ్వత ఉద్యోగం తొలగించి. కాంట్రాక్ట్ వ్యవస్థను మరింత పెంచు పోషిస్తున్నారని ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులు. ప్రజా ప్రతినిధులు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని లేకుంటే ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ కార్మికులు రాము. రవి. స్వరూప. పుష్ప. లక్ష్మి తో పాటు తదితరులు పాల్గొన్నారు....