ప్రపంచ మానవాళికి రక్షణ కవచం ఎర్రజెండా

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాలలో భాగంగా శనివారం ఘనంగా మేడే ఉత్సవాలనునిర్వహించారు. కార్యకర్తలంతా గ్రామం పుర వీధులలో ఊరేగింపుగా బయలు దేరి  విప్లవగేయాలు ఆలపిస్తూ ఎర్రజెండా ప్రాముఖ్యతను తెలియజేశారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, విశ్రాంత  ఉపాధ్యాయులు   వనం శాంతి కుమార్  చేత జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరo సీపీఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శి రాచకొండ కనకయ్య  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వనం శాంతికుమార్  మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ప్రపంచ మానవాళికి ఏనాటికైనా ఎర్రజెండా రక్షణ కోసం నిలబడుతుందని అన్నారు. అలాంటి జెండా కింద పనిచేయడం ఒక గొప్ప వరంగా భావించాలి అన్నారు. పాటిమట్ల గ్రామంలో 1946 నుండి ఊరుఊరంతాకమ్యూనిస్టులకు నిలయం అని, పాత  తరం నాయకుల  పోరాటాల ఫలితంగా, ఎన్నో  గ్రామం సమస్యలను అధిగమించి పరిష్కరించుకున్నాము అన్నారు.

Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్​కు బీఆర్​ఎస్​ బంపర్​ ఆఫర్

రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీల సహకారంతో గ్రామపంచాయితీ  సర్పంచ్ స్థానం కైవసం చేసుకోవటానికి సర్వ శక్తులూ ఒడ్డి గెలుస్తామని ధీమా వక్తం చేశారు.  జిల్లా కమిటీ సభ్యులు.. బొల్లు యాదగిరి, మాట్లాడుతూ..1886 లో చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటంలో అనేకమంది కార్మికులు బలిదానం చేసి సాధించుకున్న హక్కులను, నేటి మోడీ ప్రభుత్వం వారి హక్కులను కాలరాస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల పార్టీ కార్యదర్శి గుండు  వెంకటనర్సు, మండల కమిటీ సభ్యులు కురిమేటి యాదయ్య, శాఖ కార్యదర్శి రాచకొండ సుధాకర్, బండి రవి, మెతుకు సాయిలు,  సోమయ్య, సాంబయ్య, మెతుకు అంజయ్య, రసూల్,  సుగుణమ్మ, రాములమ్మ,  మెతుకు సత్తమ్మ, దొండ రాములు, సత్తమ్మ, ఇస్తారి, యాదగిరి,  కురిమేటి యాదమ్మ, సుమన్  తదితరులు పాల్గొన్నారు.

Also Read:  పొంగులేటి వద్దకు టిడిపి నేతలు