అగ్ని ప్రమాదాల నివారణఫై ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్

అగ్ని ప్రమాదాల నివారణఫై ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అగ్నిమాపక వరోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్ లో జగిత్యాల అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల నివారణఫై మాక్ డ్రిల్ల్ నిర్వహించారు. అగ్నిప్రమాదలపై ప్రజలలో చైతన్యం తీసుకురావడానికే అగ్నిమాపక వరోత్సవాలలు నిర్వహిస్తున్నామని సిబ్బంది తెలిపారు.

అగ్ని ప్రమాదాలు జరిగినవుడు తీసుకివాల్సిన జాగ్రత్తలు, నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అగ్నిప్రమాదల నుండి ఆస్తులు, ప్రాణాలు కాపాడుకునేందుకు అధికారులు ప్రదర్శించే ధైర్య సాహసాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి అగ్నిమాపక అధికారి జి .మధు, ఏ ఎల్ ఎఫ్ ప్రశాంత్, డ్రైవర్ ఆపరేటర్ ఎ. మల్లేశం, ఫైర్ మాన్లు నరేష్, వేణు తదితర సిబ్బంది పాల్గొన్నారు.