సాయిబాబా మందిరంలో సాయి నామ సప్తాహం

సాయిబాబా మందిరంలో సాయి నామ సప్తాహం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో అంగ రంగ వైభవంగా సాయి నామ సప్తాహోత్సవం కొనసాగుతుంది. 8 రోజుల పాటు నిర్విరామంగా సాగుతున్న సాయి నామ సప్తాహంలో నిర్విరామంగా భక్తులు బ్యాచులుగా పాల్గొని సాయి నామ జపం చేస్తున్నారు. 1008 కళశాలకు ప్రతి నిత్య హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఆలయ నిర్వాహకులు డా. సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, మార కైలాసం, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, టి . రవిచంద్ర, కంచి కిషన్, గంగాధర్, రాజలింగం, రామకిషన్ రావు, మారుతి, తిరుపతి, కడలి రామ కృష్ణా రావు, తదితరులు పాల్గోన్నారు.