దళిత జర్నలిస్టులకు దళిత బంధు స్కీమ్

దళిత జర్నలిస్టులకు దళిత బంధు స్కీమ్

సిద్దిపేటలో ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్టుల నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశం

హాజరైన రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: దళిత జర్నలిస్టులు సమన్వయంతో పనిచేయాలని, ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వేయాలని,దళిత వర్గాలకు ప్రభుత్వం ఇచ్చే ఫలాలను వారు పొందాలని పలువురు వక్తలు సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో ఆదివారంనాడు  ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్టుల నెట్వర్క్ తెలంగాణ చాప్టర్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.

ఈ సభలో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్టు నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, సిద్దిపేట జిల్లా బాధ్యులు బబ్బురు రాజు,జంగం రాజలింగం,మంద జనార్ధన్, పల్లెటూరు ప్రసాద్ ,కొండ్ర రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి దళిత జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాటలో, బుద్ధుని బోధనలతో సమన్వయ దృక్పథం, శాంతి, సహనంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వము దళితుల సంక్షేమం కోసం ప్రారంభించిన దళిత బందును, జర్నలిస్టులకు అందించేందుకు కృషి చేస్తానని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ప్రకటించారు.

నియోజకవర్గాల వారీగా ఈ స్కీం వర్తింపజేస్తామని చెప్పారు. దళిత జర్నలిస్టులు మూడు లక్ష్యాలతో ముందుకు సాగాలని ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్ట్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య సూచించారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని దళిత అభ్యున్నతికి కృషి చేయాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు.

నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు 

ఇంటర్ నేషనల్ దళిత్ జర్నలిస్ట్స్ నెట్ వర్క్  తెలంగాణ చాఫ్టర్ 
తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది.
తెలంగాణ కన్వీనర్ 
జనార్దన్ ,
కో కన్వీనర్ 
రాజలింగం ,
తెలంగాణ 
ఉమ్మడి జిల్లాల ఇంచార్జులుగా 
మెదక్ : నాగరాజు ,
రంగారెడ్డి : జంగయ్య ,
నిజామాబాద్ : సాయిలు ,
మహబూబ్ నగర్ : శ్రీరామ్ ,
కరీం నగర్ : ప్రేమ్ కుమార్ ,
వరంగల్ : వెంకట స్వామి ,
ఖమ్మం : శ్రీధర్ , కర్ణాకర్ ,
ఆదిలాబాద్ : సంతోష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.