ఓడిపోయిన తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

ఓడిపోయిన తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

ముద్ర,సెంట్రల్ డెస్క్:-తెలంగాణ రాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఓట‌మి చ‌వి చూశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి ఆమె రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత త‌మిళ‌నాడులోని చెన్నై సౌత్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె బీజేపీ త‌ర‌పున‌ పోటీ చేశారు.అయితే ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆమె ఘోర పరాజ‌యం పాల‌య్యారు. డీఎంకే సిట్టింగ్ ఎంపీ థామిజ్‌చాహీ తంగ‌పండియ‌న్ చేతిలో త‌మిళిసై చిత్తుగా ఓడిపోయారు. అన్నాడీఎంకే అభ్య‌ర్థి జే జ‌య‌వ‌ర్ధ‌న్ మూడో స్థానానికి ప‌రిమితం అయ్యారు.

62 ఏండ్ల వ‌య‌సున్న త‌మిళిసై గ‌తంలో త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్‌గా ప‌ని చేశారు. 2019 నుంచి 2024 మార్చి వ‌ర‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా ఆమె ప‌ని చేశారు. 2009, 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కూడా ఆమె ఓట‌మి పాల‌య్యారు. 2019 ఎన్నిక‌ల్లో డీఎంకే అభ్య‌ర్థి క‌నిమొళి చేతిలో ఓడిపోయారు. 2006, 2011, 2016 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఘోర ఓట‌మి చ‌వి చూశారు.