ర‌ష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి...

ర‌ష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో నదిలో అయిదుగురు భారతీయ విద్యార్థులు మునిగిపోయారు. స్థానికులు అందులో ఒకరిని రక్షించారు. నలుగురు పూర్తిగా నీటిలో ముగిని మృతి చెందారు. మరణించిన నలుగురిలో 18-20 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువ‌కులు కాగా,మ‌రో ఇద్ద‌రు యువ‌తులు . వారంతా వెలికి నొవ్‌గోరోడ్ నగరంలోని సమీపంలోని నొవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నారు.

కాగా, వోల్ఖోవ్ నది ఒడ్డున నిలబడిన ఉన్న ఓ భారతీయ విద్యార్థిని నీటిలో మునిగింది. ఆమెను రక్షించేందుకు నలుగురు సహచరులు ప్రయత్నించారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆ విద్యార్థినితోపాటు మరో ముగ్గురు కూడా నదిలో మునిగిపోయారు. ఓ బాలుడిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. “సరైన వైద్యం అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఇండియన్ మిషన్ “ఎక్స్‌”లో రాసింది.