గాదరి కిషోర్ కుమార్ గెలుపే లక్ష్యంగా ప్రచారం

గాదరి కిషోర్ కుమార్ గెలుపే లక్ష్యంగా ప్రచారం

మోత్కూర్(ముద్ర న్యూస్): జామచెట్లబావి,కొండాపురం లో బి ఆర్ ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం, ర్యాలీ నిర్వహించి కారు గుర్తు కు ఓటు వేసి గాదరి కిషోర్ కుమార్ ను గెలిపించాలని అన్నారు . ఈ సందర్బంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టినసంక్షేమపథకాలను,మేనిఫెస్టో ను ప్రజలకు వివరించి ఓటు అభ్యర్ధించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మేగారెడ్డి,జిల్లా నాయకులు గుర్రం లక్ష్మీనరసింహ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బొడ్డుపల్లి కళ్యాణ్, కౌన్సిలర్ ధబ్బేటి విజయ, రైతు బంధు గ్రామ కో ఆర్డినేటర్ ధబ్బేటి రమేష్,వార్డ్ అధ్యక్షుడు కల్వల రాము, శ్రీశైలం,మన్నే మల్లయ్య,మర్రి  వెంకన్న, సోమరాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.