ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే టాప్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే టాప్

 ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ (Telangana) ఇంటర్మీడియట్ (Intermediate) ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఫస్ట్ ఇయర్ (First Year), సెకండ్ ఇయర్ (Second Year) ఫలితాలను ఒక్కసారే విడుదల చేసింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 60.01 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, సెకండ్ ఇయర్ లో 64.61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం ఫలితాలలో రంగారెడ్డి (Rangareddy) జిల్లా  మొదటి స్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ములుగు (Mulugu) జిల్లా టాప్ లో నిలిచింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ (Principle Secretary) బుర్రా వెంకటేశమ్, సెక్రటరీ (Secretary) శృతి ఓఝా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. tsbie.cgg.gov.in .