18 రోజుల్లో రూ. 670 కోట్ల బీర్లు తాగేశారు!

18 రోజుల్లో రూ. 670 కోట్ల బీర్లు తాగేశారు!

ముద్ర, తెలంగాణ బ్యూరో: అసలే ఎండలు మండిపోతున్నాయ్... ఇంకో పక్క ఎన్నికల ప్రచారం ముమ్మరమైంది. ఎండలోపడి తిరుగుడే తిరుగుడు. దీనికి విరుగుడేందంటే.. ఛిల్డ్ బీర్. ఇంకేముంది.. బీర్ల అమ్మకాలు కెవ్వు కేక పుట్టించాయ్.. 18 రోజుల్లో తెలంగాణలోని మద్యం ప్రియులు ఏకంగా 670 కోట్ల రూపాయల బీర్లు తాగేశారు. ఇప్పటిదాకా బీర్ల అమ్మకాల్లో ఇదే రికార్డ్. గత సంవత్సరం అమ్మకాలతో పోలిస్తే... ఇది 28.7 శాతం ఎక్కువ. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి 18వ తేదీ దాకా 23,58,827 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి ఎండలెంతగా మండిపోతున్నాయో అర్థమవుతుంది కదా..