నకిలీ గుట్కా తయారీ కేంద్రం పై హయత్ నగర్ పోలీసులు దాడులు

నకిలీ గుట్కా తయారీ కేంద్రం పై హయత్ నగర్ పోలీసులు దాడులు
  • సుమారు 10 లక్షల విలువైన గుట్కాతయారీకి ఉపయోగించే మెటీరియల్ సీజ్

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-రంగారెడ్డి జిల్లా లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలానగర్ లో పక్క సమాచారం తో నకిలీ గుట్కా తయారీ కేంద్రం పై హయత్ నగర్ పోలీసులు దాడులు చేసారు.  సుమారు 10 లక్షల విలువైన గుట్కాతయారీకి ఉపయోగించే మెటీరియల్ మరియు తయారీ పరికరాలు సీజ్ చేశారు. గుట్కా తయారీ కేంద్రంపై దాడి చేసిన పోలీస్లు ఐదుగురిపై కేస్ నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది,నకిలీ బ్రాండ్ లతో గుట్కా తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారని, ఇలాంటీ అసాంఘిక కర్యకలాపాలకు ఇంటిని రే0టుకు ఇచ్చిన యజమాని పై కూడా కేస్ నమోదు చేస్తున్నట్లు హయత్ నగర్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు.