టీమ్ ఎస్ ఎమ్ ఎఫ్ అధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయుల రివ్యూ మీటింగ్

టీమ్ ఎస్ ఎమ్ ఎఫ్ అధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయుల రివ్యూ మీటింగ్

ముద్ర, కోరుట్ల: కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో  శాసన సభ్యులు దా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆహ్వానం మేరకూ టీమ్ ఎస్ ఎమ్ ఎఫ్ అధ్వర్యంలో శనివారం నియోజకవర్గం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల రివ్యూ మీటింగ్ జరిగింది. విద్యార్థులకి అవసరమైన విషయాలు, కెరీర్ గైడెన్స్, ఉపన్యాస శిక్షణ, మానసిక దృఢత్వం, మొదలగు వాటిని టీమ్ సభ్యులు ప్రొజెక్టర్ ద్వారా ప్రధాన ఉపాధ్యాయులు కు వివరించారు. భవిష్యత్తు లో, విద్యార్థులకు ఎలాంటి అవసరం ఉన్న తమ వంతు సహకారం ఊంటుందని అన్నారు. ఈకార్యక్రమంలో  టీమ్ సభ్యులు వెలగందుల అఖిల్, గుంటుక సాగర్ , కడర్ల విశాల్ ,పోతునూరి నిఖిల్ ,బండరీ కార్తీక్ మరియు పట్టాన, మండలాల ప్రభుత్వా ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.