జిల్లాలో భారీ వడగండ్ల వర్షం

జిల్లాలో భారీ వడగండ్ల వర్షం

తడిసి ముద్దయిన వరిధాన్యం - రాలిన మామిడి కాయలు
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో  మంగళవారం మధ్యాహ్నం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగoడ్ల వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో చిన్న చిన్న కుంటలు, కాలువలు జలమయమాయ్యాయి. జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుళ్లబాద్, నిజాంసాగర్ తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది.

దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసిముద్దయింది. పలుచోట్ల మామిడి కాయలు నెలరాలాయి.  గత రెండు రోజులుగా వాతావరణం లో మార్పులు, అకాలవర్షాల కారణంగా రైతులు లబోదిబోమంటున్నారు. రైతులకు భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు.